రూ.14 కోట్లతో గాల్వోనియం షెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
● జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
ఆదోని అర్బన్: వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ దిగుబడులు వర్షానికి తడవకుండా రూ.14 కోట్ల తో గాల్వోనియం షెడ్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా తెలిపారు. మంగళవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డును ఆయన తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడా రు. ఎకరాని పెట్టుబడి, దిగుబడి, లాభం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పత్తి దిగు బడులు పరిశీలించారు. పత్తి దిగుబడులను సీసీఐకు విక్రయించుకుంటే మరింత లాభం వస్తుందని రైతులకు కలెక్టర్ సూచించారు. సీసీఐకి ఎలా విక్రయించుకోవాలో రైతులకు అవగాహన కల్పించాలని యార్డు అధికారులకు సూచించారు. మార్కెట్‌లో షెడ్ ఏర్పాటుకు కమిషనర్‌తో మాట్లాడతానని, డ్రైనేజీ ఏర్పాటు కు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇ చ్చారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ బి.నవ్య, ఆదోని సబ్‌కలెక్టర మౌర్య భరద్వాజ్, వ్యవసాయ మార్కెట్‌యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి, డీఈ సుబ్బారెడ్డి ఉన్నారు.
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా వైద్యాధికారులను ఆదేశించారు. ఆదోని ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిని ఆయన తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఓపీ వార్డును, పీపీటీసీ గది, యాంటినేటల్ వార్డు, రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రం, నవజాత శిశువు సంరక్షణ విభాగం, పోస్టు ఆపరేటివ్ వార్డు–1, మెడికల్ రికార్డు రూమ్, గైనకాలజీ వార్డులను తనిఖీ చేశారు. అందుతున్న సేవలపై గర్భిణుల ను అడిగి తెలుసుకున్నారు. ఆదోని మాతాశిశు ఆస్ప త్రిలో ఇప్పటికే 12 మంది సిబ్బంది ఉన్నారని, గర్భిణు లకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గానూ అదనంగా 8 మంది స్టాఫ్ నర్సులను డిప్యుటేషన్ వేశామని కలెక్టర్ తెలిపారు. వీరి ద్వారా షిఫ్ట్ పద్ధతిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పెచ్చులూడుతున్న గోడలకు మరమ్మతులు చేయించేందుకు ప్రతిపాదనలు పంపాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. ఆయన వెంట డీసీహెచ్‌ఎస్ మాధవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవిలత ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment