వేధింపులు తాళలేక..
దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామంలో ఒకే ఒక గ్రామైక్య సంఘం ఉంది. ఈ సంఘానికి కొన్నేళ్లుగా ఈ.రంగస్వామి గౌడు వీఓఏగా పనిచేస్తున్నారు. ఈయనపై ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత టీడీపీ నేతలు తమ వర్గానికి చెందిన వ్యక్తికి వీఓఏగా నియమించాలనుకున్నారు. దీంతో రాజీనామా చేయాలని రంగస్వామి గౌడుపై ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేయకపోతే ఇబ్బందులు పడుతావంటూ బెదిరించారు. మనస్తాపంతో ఆగస్టు 23వ తేదీన పురుగు మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన వెలుగు వీఓఏ నరసింహులు నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment