అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఆదోని అర్బన్: పట్టణంలోని బార్‌పేట్ పెద్ద కాలువలో అనుమాన స్పద స్థితిలో కౌడల్‌పేటకు చెందిన సయ్యద్‌మహ్మద్ గౌస్(28) బుధవారం మృతిచెందాడు. త్రీటౌన్ సీఐ రామలింగయ్య తెలిపిన వివరాలు.. సయ్యద్‌మహ్మద్‌గౌస్ మద్యానికి బానిస అయ్యాడు. ఈక్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు టీ తాగి వస్తానని వెళ్లిన గౌస్ కాలువలో శవమై తేలాడు. మృతదేహం పక్కనే కూరగాయలు తరిమే కత్తి ఉంది. మృతుడి గొంతు వద్ద గాయం ఉంది. విషయం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కాలువలో నుంచి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజుల నుంచి మానసిక స్థితి సరిగా లేదని, తన కుమారుడు ఎలా మృతిచెందాడో తెలియడం లేదని తల్లి సాహెర్‌భాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment