కలెక్టరేట్‌ భద్రతపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ భద్రతపై సమీక్ష

Published Fri, Jan 31 2025 1:55 AM | Last Updated on Fri, Jan 31 2025 1:55 AM

కలెక్టరేట్‌ భద్రతపై సమీక్ష

కలెక్టరేట్‌ భద్రతపై సమీక్ష

కర్నూలు (సెంట్రల్‌): డీఆర్వో బి.కె.వెంకటేశ్వ ర్లు అధ్యక్షతన కలెక్టరేట్‌ భద్రతపై పోలీసు, అగ్నిమాపక శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు సమీక్ష నిర్వహించారు. విజయవాడకు చెందిన డీఎస్పీ చక్రాధరరావు, కర్నూలు టౌన్‌ డీఎస్పీ బాబు ప్రసాద్‌, ఫైర్‌ ఆఫీసర్లు వై.చిన్నబజారి, బి.ఓబులేసు, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లు సురేష్‌ బాబు, విద్యుత్‌ శాఖ అధికారి పి.ఓబులేసు, కర్నూలు మూడవ పట్టణ సీఐ శేషయ్య తదితరులు హాజరై కలెక్టరేట్‌ భద్రతపై సమీక్షించారు. ప్రస్తుతం కలెక్టరేట్‌ లోపలికి, బయటకు వెళ్లేందుకు నాలుగు గేట్లు ఉన్నాయని, మెయిన్‌ గేటు, ఫారెస్ట్‌ ఆఫీస్‌ సమీపంలో ఉన్న గేటులను మాత్రమే వినియోగించాలని, చేనేత భవన్‌, నగేష్‌ టీస్టాల్‌ దగ్గర ఉన్న రెండు గేట్లను మూసివేయించాలని, మెయిన్‌ గేటు వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండేలా ఔట్‌పోస్టును హెచ్చరించాలని సమీక్షలో అధికారులు అభిప్రాయపడ్డారు. త్వరలోనే కలెక్ట రేట్‌ భద్రతపై పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు డీఆర్వో బి.కె.వెంకటేశ్వర్లు తెలిపారు.

కేసీకి నీటి విడుదల

కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ నుంచి గురువారం 2,445 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. టీబీ డ్యాం నుంచి ఈ ఏడాది బోర్డు అధికారులు నీటి లభ్యత అంచనా మేరకు 9 టీఎంసీ నీటిని కేటాయించారు. ఇందులో నుంచి 2.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని జల వనరుల శాఖ కర్నూలు పర్యవేక్షక ఇంజినీర్‌ నుంచి కర్నూ లు ప్రాజెక్ట్సు సీఈ ద్వారా తుంగభద్ర బోర్డుకు ఇటీవల ఇండెంట్‌ పెట్టారు. ఈ మేరకు తెలంగాణలోని ఆర్టీఎస్‌ కాలువ వాటాతో కలిపి విడుదల చేస్తున్న నీరు ప్రస్తుతం బ్యారేజీలోకి ప్రవహిస్తోంది. ఈ నీటితో కేసీ ఆయకట్టుతో పాటు, తాగునీ టి పథకాలకు అధికారులు విడుదల చేస్తున్నారు.

సారాకు స్వస్తి చెప్పకపోతే పీడీ కేసులు

కర్నూలు: ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే నాటుసారా తయారీ, విక్రయాలు, రవాణాను మానుకోకపోతే పీడీ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని కర్నూలు ఎకై ్సజ్‌ స్టేషన్‌ సీఐ చంద్రహాస్‌, ఈఎస్‌టీఎఫ్‌ సీఐ రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు. కల్లూరు మండలం కొల్లంపల్లి తండా గ్రా మంలో గురువారం ఎకై ్సజ్‌ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సారా వినియోగంతో ప్రజలకు కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. సారా తయారీ రవాణాకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని తెలియజేశారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ, ఈఎస్‌టీఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బీసీ, ఈబీసీలకు రుణాలు

ఫిబ్రవరి 7వ తేదీలోగా పేర్లను

నమోదు చేసుకోండి

కర్నూలు(అర్బన్‌): బీసీ కార్పొరేషన్‌ ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారికి సబ్సిడీ రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌ జాకీర్‌హుసేన్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లా డుతూ ఆయా సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన వారికి సబ్సిడీ రుణాలు అందజేస్తున్నామన్నారు. బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారు 21 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలని, కాపు (కాపు, బలిజ, తెలగ, ఒంటరి ) సామాజిక వర్గానికి చెందిన వారు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారం, సేవలు, రవాణా విభాగం తదితర సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన వారు https://apobmms.apcfss.in వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 7వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈడీ కోరారు.

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

శ్రీశైలంటెంపుల్‌: ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఈఓ ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అన్ని విభాగాల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఉద్యోగి భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్ధ వహించాలన్నారు. మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

సారాకు స్వస్తి చెప్పాలని ప్రజలకు

వివరిస్తున్న పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement