ప్రభుత్వంలో చలనం లేదు
ఉపాధ్యాయులకు సంబంధించే వేలాది కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది జూన్ నుంచి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ బకాయిలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఉపాధ్యాయులకు సంబంధించి అన్ని రకాల బిల్లులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. సత్వరం న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– రవికుమార్, యూటీఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment