‘మైక్రో’ వేధింపులు | - | Sakshi
Sakshi News home page

‘మైక్రో’ వేధింపులు

Published Fri, Jan 31 2025 1:55 AM | Last Updated on Fri, Jan 31 2025 1:55 AM

 ‘మైక్రో’ వేధింపులు

‘మైక్రో’ వేధింపులు

ఆలూరు: కంతు కట్టలేదని ఇంటి యజమానిని బయటకు రాన్వికుండా మైక్రోఫైనాన్స్‌ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన ఆలూరులో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండకు చెందిన స్పందన మైక్రోఫైనాన్స్‌ (సూక్ష్మరుణాన్ని)నుంచి గత ఐదు నెలల క్రితం రూ. 55,000 నగదును ఆలూరు కోయినగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు శివ, సరోజ తీసుకున్నారు. తీసుకున్న అప్పు మొత్తానికి ప్రతి నెలా రూ. 2,500 ప్రకారంగా వడ్డీని చెల్లించాలని ఆధార్‌, ఓటరు కార్డులను తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో వడ్డీ చెల్లించలేక పోతున్నామని కొంత సమయం ఇవ్వాలని వారు ఫైనాన్స్‌ సిబ్బందిని అడిగినా ఫలితం లేకుండా పోయింది. ఫైనాన్స్‌ సిబ్బంది ఇంట్లోకి వచ్చి వేధింపులకు గురిచేస్తున్రాని కాలనీవాసులు ఆలూరు పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారాన్ని చేరవేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ జీ. దిలీప్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement