కరువుపై అధ్యయనం
పెద్డకడబూరు: కరువు ప్రభావిత ప్రాంతాలపై అధ్యయనం వేస్తున్నట్లు ఐఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్‌బాబు తెలిపారు. మండల ఏఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ కర్నూలు) ప్రొఫెసర్ డాక్టర్ నరేష్‌బాబు, ఆయన బృందం మండల పరిధిలోని పీకలబెట్ట, గవిగట్టు గ్రామాలలో కరువు ప్రభావిత ప్రాంతాలను గురువారం సందర్శించారు. కరువు కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వారి సౌజన్యంతో అనంతపురం, కర్నూలు జిల్లాలలోని కరువు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిశోధనలు చేస్తామన్నారు. సాధారణ పంట పొలాలను, కరువు ప్రభావిత పొలాల ఫొటోలను సేకరించి ఆర్టీఫిసియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా వర్గీకరించడానికి అభివృద్ధి చేయబోతున్నామన్నారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందిన తరువాత కరువు ద్వారా నష్టపోయిన పంటలను గుర్తించడం సులభతరం అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment