![కుక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06knl19h-200006_mr-1738872034-0.jpg.webp?itok=-v9zgE6_)
కుక్కలకు భయపడి స్కూల్ మానేశాడు
నా కుమారుడు ఫాజలాకు నెల క్రితం ఊళ్లో కుక్క కరిచింది. ఇప్పటికే నాలుగుసార్లు కర్నూలు ప్రభు త్వ సర్వజన వైద్యశాలకు వచ్చి ఇంజెక్షన్లు వేయించాం. మా ఊళ్లో కుక్కలు చాలా ఉన్నాయి. కుక్క కాటు వేశాక వాటికి భయపడి నా కుమారుడు స్కూల్‌కు వెళ్లడం కూడా మానేశాడు. కుక్కలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – జమీలా,
మునగాలపాడు, కర్నూలు మండలం
వారం క్రితం కుక్క కరిచింది
నేను ఇంటర్ వరకు చదివి చదువు మానేశాను. ప్రస్తుతం గ్యాస్ డెలివరి బాయ్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. గత నెల 30వ తేదీన దాల్‌మిల్ వద్ద వెళ్లగా గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు వెళ్తుండగా కుక్క కరిచింది. ఇప్పటి వరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చి మూడు ఇంజెక్షన్లు వేయించుకున్నాను. కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి.
–రషీద్, ఉల్చాల గ్రామం, కర్నూలు మండలం
అన్ని పీహెచ్‌సీల్లో
ఏఆర్‌వీ వ్యాక్సిన్ ఉంది
జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ఏఆర్‌వీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఎక్కడా కొరత అనేది లేదు. ఇమ్యునోగ్లోబిన్స్ ఇంజెక్షన్లు మాత్రం కేవలం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం అందుబాటులో ఉన్నాయి. కుక్కకాటు కేసులు పెరుగుతున్న విషయాన్ని, వాటిని నియంత్రించాలని పేర్కొంటూ మున్సిపాలిటీ, పంచాయతీ శాఖలకు సమాచారం ఇచ్చాం. కుక్కకాటుకు గురైన వారు తప్పనిసరిగా వైద్యులు సూచించిన మేరకు వ్యాక్సిన్ వేయించుకోవాలి.
– డాక్టర్ పి. శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు
![కుక్కలకు భయపడి స్కూల్ మానేశాడు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06knl19i-200006_mr-1738872034-1.jpg)
కుక్కలకు భయపడి స్కూల్ మానేశాడు
![కుక్కలకు భయపడి స్కూల్ మానేశాడు
2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06knl19j-200006_mr-1738872034-2.jpg)
కుక్కలకు భయపడి స్కూల్ మానేశాడు
Comments
Please login to add a commentAdd a comment