![అట్టహ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06knl39-200011_mr-1738872033-0.jpg.webp?itok=UtRxSs_i)
అట్టహాసంగా బాలోత్సవం ప్రారంభం
కర్నూలు (సిటీ): బాలోత్సవం గురువా రం నగర శివారులోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, డీఈఓ శామ్యూల్ పాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలోత్సవ అధ్యక్షుడు బడేసాహెబ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభలో కల్టెకర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు కృషి చేయాలన్నా రు. తాను పాఠశాలల్లో మోనో యాక్ష న్‌లో ‘ఇన్‌స్పెక్టర్ రంజిత్’ డైలాగ్ చెప్పే వాడినని, అందుకే తన పేరు రంజిత్‌గా మారిందని గుర్తు చేసుకున్నారు. డీఈఓ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. బాల్యం నుంచే క్రమశిక్షణ, పట్టుదల అలవర్చుకోవాలన్నారు. మొదటి రోజు 22 రకాల సాంస్కృతిక, అకడమిక్ పోటీలు నిర్వహించారు. దాదాపు 57 పాఠశాలల నుంచి 2 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం కూడా బాలోత్సవం కొనసాగనుంది. కార్యక్రమంలో బాలోత్స వ కమిటీ రాష్ట్ర నాయకులు, గౌరవాధ్యక్షుడు జి.పుల్ల య్య, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ అక్తర్ భాను, ప్రైవేటు విద్యాసంస్థల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు పీబీవీ సుబ్బ య్య, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్, సీఈఓ విల్సన్, ప్రిన్సిపాల్ మీనాక్షి విల్సన్, ప్రైవేటు విద్యాసంస్థల సంఘం జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నృత్యం చేస్తున్న విద్యార్థిని
![అట్టహాసంగా బాలోత్సవం ప్రారంభం1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06knl39b-200011_mr-1738872033-1.jpg)
అట్టహాసంగా బాలోత్సవం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment