![No Headline](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/05knl32d-200097_mr-1738872035-0.jpg.webp?itok=YFQM9zRM)
No Headline
కర్నూలు కల్చరల్: మాఘ మాసం వచ్చింది.. మంచి ముహూర్తాలను తెచ్చింది.. ఏటా మాఘ మాసం శుభ ముహుర్తాలను మోసుకొని వస్తుంది. ఈ సారి కూడా శుభ గడియలు తెచ్చింది. దీంతో శుభకార్యాల సీజన్ మొదలైంది. ఊరువాడా సందడి కనిపిస్తోంది. పెళ్లి బాజా మోగింది. పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు పెద్దల దీవె నలతో జంటలు ఒక్కటవుతున్నాయి. అంతే కాదు గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, ఎంగేజ్‌మెంట్‌లు తదితరాలు విస్తృతంగా జరగనున్నాయి. పెళ్లిళ్లు.. గృహ ప్రవేశాలు తదితర శుభ కార్యాలకు ముందుగా గుర్తుకొచ్చేది మాఘ మాసమే. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మొదటగా వచ్చే శుభం కలిగే మాసంగా దీనిని పండితులు పరిగణిస్తారు. ఉత్తరాయణం పుష్య మాసంలో రావడంతో అది శూన్య మాసం కావడంతో శుభ కార్యక్రమాలు చేపట్ట్టారు. గత నెల 30వ తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభమైంది. దీంతో వివాహాది శుభకార్యక్రమాల సందడి మొదలైంది. ఇప్పటికే రెండు మూడు నెలల ముందు నుంచి సంబంధాలు కుదుర్చుకున్న జంటల తల్లిదండ్రులు మాఘ మాసం రావడంతో పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో రాబోయే రోజులన్నీ భాజాభజంత్రీలతో మారుమోగనున్నాయి. ఒక పెళ్లిళ్లే కాకుండా గృహ నిర్మాణాల ప్రారంభం, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, ఆడబిడ్డలకు ఒడిబియ్యం పోయడం, నిశ్చితార్థం తదితర కార్యాలకు వరుసగా ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
మాఘ మాసంలో అధికంగా పెళ్లిళ్లు
మాఘఽ మాసంలో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి. ఒక్కొక్క రోజు గ్రామాల్లో కూడా రెండు మూడు పెళ్లిళ్లు ఉన్నాయి. పురోహితులు దొరకని పరిస్థితి ఉంది. అన్ని ఊర్లలో వివాహాలు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో పలువురు ముందుగానే పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు తేదీలు నిర్ణయించుకున్నారు.
– తరిమెల అశోక్ శర్మ, పండితుడు
Comments
Please login to add a commentAdd a comment