![రేపు ‘నవోదయ’ పరీక్ష](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mlm01-200049_mr-1738872033-0.jpg.webp?itok=1cc7OSAa)
రేపు ‘నవోదయ’ పరీక్ష
ఎమ్మిగనూరురూరల్: బనవాసి జవహర్ నవోద య విద్యాలయంలో 9వ, 11వ తరగతి లేటరల్ ఎంట్రీ పరీక్ష శనివారం నిర్వహించనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి తెలిపారు. నవోదయ విద్యాలయంలో పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో గురువారం సమావేశం నిర్వహించారు. 9వ తరగతిలో ప్రవేశానికి 8వ తేదీ ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 1.45 వరకు మాచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో, బనవాసి జవహార్ నవోదయ విద్యాలయంలో పరీక్ష ఉంటుందని చెప్పారు. అలాగే 11వ తరగతికి అదే రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ప్రభుత్వ బాలు ర హైస్కూల్, బనవాసి ఏపీ గురుకుల పాఠశాల, వీవర్స్ కాలనీ జిల్లా పరిషత్ పాఠశాల, నీలకంఠేశ్వర హైస్కూల్(ఎస్‌ఎన్‌ఎస్)లో పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హోజరు కావాలన్నారు.
బాల్య వివాహాలు చేస్తే జైలు
● జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘు
నందవరం: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించిన వారికి జైలు శిక్ష తప్పదని జిల్లా నోడ ల్ అధికారి డాక్టర్ రఘు హెచ్చరించారు. నాగలదిన్నె గ్రామంలో సంచార వైద్య చికిత్సలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం, నిరక్షరాస్యత, మేనరికపు సంబంధాలు కారణంగా బాలికలకు కొందరు వివాహాలు చేస్తున్నారన్నా రు. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పిల్లల ను పెళ్లి పీఠాలు ఎక్కించడం దారుణమన్నారు. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు వయస్సు దాటిన తరువాత వివాహాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ శ్రీలేఖ, ఆరోగ్య పర్యవేక్షకురాలు సుశీలబాయి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా మధ్వనవమి వేడుకలు
మంత్రాలయం: స్థానిక రాఘవేంద్రస్వామి మఠంలో మధ్వనవమి వేడకలు వైభవంగా జరిగాయి. గురువారం శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నేతృత్వంలో మధ్వ నవమి వేడుకలు చేపట్టారు. మధ్వ మత మూల గురువు మధ్వాచార్యులకు విశేషంగా పూజలు గావించి బంగారు రథంపై కొలువుంచగా పీఠాధిపతి ప్రత్యేక హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో మధ్వాచార్యుల రథయాత్ర భక్తజన సందోహం మధ్య విశేషంగా సాగింది. మధ్వాచార్యులకు అంతకు ముందు ఊంజల మంటపంలో దివిటీ, చామర సేవలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment