ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం
● అనుమతి లేకుండా ఎల్‌ఎల్‌సీ కాలువ నీరు కర్ణాటక రిజర్వాయర్‌కు మళ్లింపు ● అడ్డుకున్న అధికారులు
హాలహర్వి: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. తుంగభధ్ర దిగువ కాలువ నీటిని అనుమతి లేకుండా కర్ణాటక రిజర్వాయర్‌కు మళ్లించేందుకు జేసీబీలతో ఎల్లెల్సీ ఆంధ్ర సరిహద్దు 135వ కి.మీ. వద్ద తవ్వుతున్నారు. విషయం తెలుసుకున్న తుంగభద్ర డ్యాం అధికారులు ఎల్‌డీఓ హాసన్‌బాషా, జేఈ దుర్గాప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మోకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలువగట్టు తవ్వకం పనులు నిలిపి వేశారు. నీరు లేక కర్ణాటక ఎర్రగుడి రిజర్వాయర్ ఎండిపోయింది. తాగునీటి సరఫరా కోసం ఎల్‌ఎల్‌సీ కాలువ నుంచి రిజర్వాయర్‌కు మళ్లిస్తున్నామని కర్ణాటక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. అయితే ఆంధ్ర నీటి వాటాను అనుమతి లేకుండా కాలువ గట్టును తవ్వడం నేరమని డ్యాం అధికారులు, ఎస్‌డీఓ హాసన్‌బాషా, జేఈ దుర్గాప్సాద్‌లు కర్ణాటక అధికారులతో వాగ్వాదం చేశారు. వెంటనే కాలువ తవ్వకం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. కలెక్టర్ అనుమతి తీసుకోవాలని డ్యాం అధికారులు కర్ణాటక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. దీంతో కాలువ తవ్వకం పనులు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర కాలువ గట్టును తవ్వకుండా మోటార్లు ద్వారా రిజర్వాయర్‌కు నీరు మళ్లించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. దీంతో కాలువ తవ్వకం పనులు నిలిపివేసి మోటార్ల ద్వారా రిజర్వాయర్‌కు నీరు మళ్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment