శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంట మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 50 సంత్సరాల వయస్సు కలిగి ఉన్న ఈ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ ఇనుప కడ్డీకి పంచెతో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో టూటౌన్ ఎస్‌ఐ బీవీ సుబ్బారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మృతుడు కర్ణాటక లేదా మహారాష్ట్రకు చెందిన వాడై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.