రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు
స్టేషన్‌ఘన్‌పూర్/జనగామ : అతిపిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, వ్యక్తిగత దూషణలు ఎదుర్కొంటూ టెస్ట్, వన్డే మ్యాచ్‌లకు స్వస్తి పలికిన రేవంత్‌రెడ్డి.. పాలనలో టీ–20 మ్యాచ్ ఆడుతున్నారని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ శివునిపల్లి రోడ్డులో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే కడియం మాట్లాడారు. అభివృద్ధే ధ్యేయంగా రోజుకు 16 గంటలు పని చేస్తున్న రేవంత్‌రెడ్డి.. సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధికి రూ.8 వందల కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఘన్‌పూర్‌లో అవినీతి, అక్రమ పాలన, పదవులు, పథకాలు అమ్ము కోవడం తప్ప గడిచిన పదిహేనేళ్లుగా అభివృద్ధి జరగలేదన్నారు.
సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment