ఉపాధ్యాయుడికి నోటీస్ జారీ
తొర్రూరు రూరల్: మండలంలోని గుడిబండతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు ఎస్. వినీల్‌కు సంజాయిషీ నోటీస్‌జారీ చేసినట్లు ఎంఈఓ మహంకాళి బుచ్చ య్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల తనిఖీల్లో భాగంగా గుడిబండతండా పాఠశాలను సైతం సందర్శించినట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాఠశాలకు ఆలస్యంగా రావడంతో సంజాయిషీ కోరుతూ నోటీస్ జారీ చేసినట్లు చెప్పారు. సంబంధిత ఉపాధ్యాయుడు వినీల్ వెంటనే జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు వివరణ ఇవ్వాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment