
న్యూఢిల్లీ: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన బీజేపీ మలి జాబితాపై స్పష్ట త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరుగను న్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మిగిలిన 66 మంది తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కీలక నాయకులు సిద్ధం చేసిన జాబితాకు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోద ముద్ర వేయనుంది.
ఇప్పటికే జనసేనతో పొత్తులు సహా తుది జాబితాపై బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. కాగా మంగళవారం తుది జాబితాపై కిషన్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులపై సమీక్షతో పాటు జనసేనతో పొత్తుకు సంబంధించిన అంశాలపై నడ్డాతో కిషన్‌రెడ్డి చర్చించారని సమాచారం.
66 స్థానాలపై వడపోత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఒకసారి భేటీ అయిన సీఈసీ రెండు జాబితాల్లో కలిపి 53 మంది అభ్యర్థిత్వాన్ని ఆమోదం వేసింది. తొలి జాబితాలో 52 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత కొన్నిచోట్ల అసంతృప్తి బయటపడింది. రెండో జాబితాలో మహబూబ్‌నగర్ నుంచి ఏపీ మిథున్‌రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే మిగతా 66 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో... గత వారం ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా రాష్ట్ర నాయకత్వం పలుమార్లు భేటీ అయి అభ్యర్థుల వడపోతను పూర్తి చేసింది. అక్కడ వచ్చి న తుది నిర్ణయాల మేరకు పోటీదారుల జాబితాను సీఈసీకి నివేదించనుంది.
నేటి సీఈసీ సమావేశానికి మోదీ, అమిత్ షా
బుధవారం జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే సీఈసీ సమావేశానికి పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా సహా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, ఇతర సభ్యులు హాజరుకానున్నారు.
వీరితో పాటు తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్ఢి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్ కుమార్, తరుణ్ ఛుగ్, సునీల్ భన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్‌లు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. బుధవారం సాయంత్రం జరుగనున్న ఈ భేటీ అనంతరం తెలంగాణ మలి జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం ఏ క్షణమైనా విడుదల చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment