డాక్టర్ నాగన్న.. ఉమ్మడి జిల్లాలో పాతతరం రాజకీయ నాయకుల్లో ఈ పేరు తెలయనివారు ఉండరు. ఆయన రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోరులో నిలిచినా విజయాన్ని దక్కించుకున్నారు. అలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి చెందిన డాక్టర్ నాగన్న 1952లో మొదటి సారి అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.
ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో అలంపూర్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. 1957లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. 1962 ఎన్నికల్లో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నాగన్న సీపీఎం అభ్యర్థి ఎస్.చలంపై 5,413 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1967 షాద్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ విధంగ ఆయన నాలుగు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. – మహబూబ్‌నగర్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment