కొత్త చట్టాలు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

కొత్త చట్టాలు ఇలా..

Published Tue, Jul 2 2024 1:48 AM | Last Updated on Tue, Jul 2 2024 11:32 AM

-

కోర్టు ఎవిడెన్స్‌ ఇచ్చే వారిలో పోలీస్‌, వైద్యులు, తహసీల్దార్‌ వంటి అధికారులు విధులు నిర్వర్తిస్తూనే, వీడియోకాల్‌ ద్వారా న్యాయమూర్తికి సాక్ష్యం చెప్పవచ్చు.

● ఐదుగురు, అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఒక వ్యక్తిని హత్యచేస్తే, సెక్షన్‌ 103 (2) ద్వారా మాబ్‌లించింగ్‌ (కులం, మతం, స్థానం)గా గుర్తించారు.

● చైన్‌ స్నాచింగ్‌ కోసం ప్రత్యేకంగా సెక్షన్‌ 304 బీఎస్‌ఎస్‌ తీసుకొచ్చారు. – యాసిడ్‌ దాడికి కొత్తగా సెక్షన్‌ 124 (బీఎన్‌ఎస్‌) అమల్లోకి వచ్చింది.

● పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం, లైంగికంగా వేధించే వారి కోసం కొత్తగా సెక్షన్‌ 69ని అమల్లోకి తీసుకొచ్చారు. – మైనర్‌ (18 ఏళ్లలోపు) పేరును మారుస్తూ, చైల్డ్‌గా గుర్తింపు తెచ్చారు.

● కొన్ని చీటింగ్‌ కేసుల్లో పట్టుబడిన నగదు కోర్టుకు మాత్రమే అనుసంధానం చేసేవారు. కొత్తగా వచ్చిన చట్టంలో పట్టుబడిన నగదు కోర్టుకు అనుసంధానం చేయడంతో పాటు బాధితులకు పంచే వెసులుబాటును జిల్లా కలెక్టర్‌కు ఇచ్చారు.

● తాజా చట్టంలో కొన్నింటికి శిక్షలు పెంచడంతో పాటు జరిమానాలు భారీగా పెంచారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చెయ్యి విరగొడితే గతంలో మూడేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా ఉండేది. ప్రస్తుతం రూ. 20 వేలకు జరిమానా పెరిగింది. – కొత్తగా టెర్రరిస్ట్‌ చట్టం 113 అమల్లోకి తీసుకువచ్చారు.

● ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతిక విభాగానికి ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేని పక్షంలో ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్‌, మెయిల్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. కానీ మూడు రోజుల్లో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సంతకాలు చేయాలి. కేసుల విషయంలో కోర్టుకు హాజరు కాలేని సాక్షులను వీడియో కాల్‌ ద్వారా కూడా విచారించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement