వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు

Published Fri, Jan 31 2025 1:01 AM | Last Updated on Fri, Jan 31 2025 1:01 AM

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): వచ్చే వేసవి కాలంలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మిషన్‌ భగీరథ ఈఈ పుల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు డీపీఓ పార్థసారధితో కలిసి ఆయన మిషన్‌ భగీరథ వేసవి యాక్షన్‌ ప్లాన్‌పై క్షేత్రస్థాయి అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీలు ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. గ్రామాల్లోని ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లను శుభ్రం చేసుకోవాలని, ప్రజలకు నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రామా ల్లో ఆయా మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలన్నారు. మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని, సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 4007ను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement