డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

Published Fri, Jan 31 2025 1:02 AM | Last Updated on Fri, Jan 31 2025 1:01 AM

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ఇది దేశ ప్రగతికి ఒక అడ్డంకిగా మారుతుందని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలో ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం మాదకద్రవ్యాలు, ట్రాఫిక్‌ నిబంధనలు, సైబర్‌ నేరాలు, బాలికల రక్షణ అంశాలపై అవగాహన సద స్సు నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పక హెల్మెట్‌ వాడాలని, కారు నడిపే క్రమంలో సీటు బెట్టు ధరించాలన్నారు. రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌, రాష్‌ డ్రైవింగ్‌, నిర్లక్ష్యంగా నడపటం వంటివి మానుకోవడం వల్ల ప్రాణాలు కాపాడుతాయని తెలిపారు. సైబర్‌ నేరాలు పెరిగిన నేపథ్యంలో సోషల్‌ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అజ్ఞాత లింకులు క్లిక్‌ చేయడం, ఓటీపీలు షేర్‌ చేయడం, వ్యక్తిగత సమాచారం తెలియజేయడం వంటివి ప్రమాదకరమన్నారు. ప్రధానంగా యువత సైబర్‌నేరాల పట్ల పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికల రక్షణ కోసం భరోసా కేంద్రం, షీటీం పని చేస్తుందని అవసరమైన బాధితులు 87126 59365 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లా నార్కొటిక్‌ డీఎస్పీ బుచ్చయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్‌ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంతో టీజీఎన్‌బీ స్థానిక పోలీసుల సహకారంతో డ్రగ్స్‌పై అవగాహన చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం డ్రగ్స్‌ వినియోగం చేయరాదని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఏఎస్పీ రాములు, డీఎస్పీలు సుదర్శన్‌, రమణారెడ్డి, ప్రిన్సిపాల్‌ విజయ్‌బాబు, సీఐలు అప్పయ్య, భగవంతురెడ్డి, ఎస్‌ఐ సుజాత పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనల పట్ల బాధ్యతగా ఉండాలి: ఎస్పీ డి.జానకి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement