No Headline
● భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పది వార్డులలో మొత్తం 3,445 అసెస్‌మెంట్లకు గాను ఈ ఏడాది రూ.2,03,62,000 ఆస్తిపన్ను రావచ్చని అంచనా వేశారు. పాత బకాయిల కింద రూ. 86,87,000 కలిపి మొత్తం రూ.2,90,49,000 వసూలు కావాలి. అయితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు రూ.1,08,50,000, పాత బకా యిల కింద రూ.8.33లక్షలు కలిపి 1,088 అసెస్‌మెంట్ల నుంచి మొత్తం రూ.1,16,83,000 (39.77 శాతం) రాబట్టగలిగారు. ఇక 8 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ఏడాది రూ.96 వేలు ఆస్తి పన్ను రావచ్చని అంచనా వేశారు. పాత బకాయిల కింద రూ.2.34 లక్షలు మొత్తం రూ.3.30 లక్షలు వసూలు కావాలి. అయితే ఇప్పటివరకు ఒకే కార్యాలయం నుంచి కేవలం రూ.3 వేలు మాత్రమే (0.77 శాతం) రాబట్టగలిగారు.
మహబూబ్‌నగర్‌లోని 49 వార్డుల పరిధిలో మొత్తం 51,117 అసెస్‌మెంట్ల (ఇళ్లు, వ్యాపార భవన సముదాయాలు, వివిధ ఫ్యాక్టరీలు)కు గాను ఈ ఏడాది రూ.20,60,95,000 ఆస్తిపన్ను రావచ్చని అంచనా వేశారు. పాత బకాయిల కింద రూ.28,95,24,000తో కలిపి మొత్తం రూ.49,56,20,000 వసూలు కావాలి. అయితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు రూ.10,52,49,000, పాత బకాయిల కింద రూ.2,55,09,000 కలిపి 18,258 అసెస్‌మెంట్ల నుంచి మొత్తం రూ.13,07,58,000 మాత్రమే (30.51 శాతం) రాబట్టగలిగారు. ఇక 243 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ఏడాది రూ.69.53 లక్షల ఆస్తి పన్ను రావచ్చని అంచనా వేశారు. పాత బకాయిల కింద రూ.15,05,41,000 కలిపి మొత్తం రూ.15.75కోట్లు వసూలు కావాలి. కాగా..ఇప్పటివరకు 34 అసెస్‌మెంట్ల నుంచి రూ.16.31 లక్షలు మాత్రమే (0.94 శాతం) రాబట్టగలిగారు.
● జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డులలో మొత్తం 18,273 అసెస్‌మెంట్లకు గాను ఈ ఏడాది రూ.3,52,55,000 ఆస్తిపన్ను రావచ్చని అంచనా వేశారు. పాత బకాయిల కింద రూ.2,27,69,000 కలిపి మొత్తం రూ.5,80,24,000 వసూలు కావాలి. అయితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు రూ.1,95,95,000, పాత బకాయిల కింద రూ.14,58,000 కలిపి 7,313 అసెస్‌మెంట్ల నుంచి మొత్తం రూ.2,10,53,000 మాత్రమే (36.31 శాతం) రాబట్టగలిగారు. ఇక 101 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ఏడాది రూ.11 లక్షలు ఆస్తి పన్ను రావచ్చని అంచనా వేశారు. పాత బకాయిల కింద రూ.41 లక్షలు కలిపి మొత్తం రూ.52 లక్షలు వసూలు కావాలి. అయితే ఇప్పటివరకు 20 అసెస్‌మెంట్ల నుంచి రూ.2 లక్షలుమాత్రమే (4 శాతం) రాబట్టగలిగారు.
3 మున్సిపాలిటీలలో ఇలా..
Comments
Please login to add a commentAdd a comment