లక్ష్యంలో సగమైనా చేరుకోలే..!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందగించాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) ముగియడానికి కేవలం రెండు నెలల గడువే మిగిలింది. అయినప్పటికీ లక్ష్యంలో సగమైనా చేరుకోలేకపోయారు. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది కొన్ని రోజులుగా వివిధ సర్వేలలో నిమగ్నం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత కుటుంబ సమగ్ర సర్వే, డిసెంబర్, జనవరి మాసాల్లో ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకం సర్వేలు కొనసాగాయి. దీంతో ఆస్తిపన్ను వసూలుపై దృష్టి పెట్టలేక
పోయారు.
గడువులోగా వసూలుకు యత్నిస్తాం
కొన్ని నెలలుగా పట్టణంలో వివిధ సర్వేల కారణంగా ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టలేకపోయాం. ప్రస్తుతం సర్వే పనులు పూర్తి కావడంతో ఆస్తిపన్ను వసూలు చేయడంపై దృష్టి సారిస్తాం. ఇంకా రెండు నెలల గడువు ఉన్నందున మా వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం.
– డి.మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్
పాలమూరులో ఆస్తిపన్ను వసూళ్లు31 శాతమే
భూత్పూర్‌లో 39, జడ్చర్లలో 36 శాతం మాత్రమే వసూలు
Comments
Please login to add a commentAdd a comment