420 హామీలు.. 420 రోజులైనా అమలు కాలేదు | - | Sakshi
Sakshi News home page

420 హామీలు.. 420 రోజులైనా అమలు కాలేదు

Published Fri, Jan 31 2025 1:02 AM | Last Updated on Fri, Jan 31 2025 1:01 AM

420 హామీలు.. 420 రోజులైనా అమలు కాలేదు

420 హామీలు.. 420 రోజులైనా అమలు కాలేదు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 420 హామీలు 420 రోజులైనా ఒక్కటి కూ డా అమలుకు నోచుకోలేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను అమలు చేసే విధంగా చూడాలని బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం గడియంచౌరస్తాలో నోటికి నల్ల వస్త్రం కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల ను అయోమయానికి గురిచేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులు, సామాన్య ప్రజలను ఎవరిని కదిలించినా ప్రభుత్వంపై ఆవేశంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని కొంతమంది నాయకులు తప్ప ఎవరూ రాష్ట్రంలో సంతోషంగా లేరన్నా రు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దరఖాస్తుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. విచారణల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారో ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు స్పష్టత లేదని విమర్శించారు. సీఎం ఒక మాట, మంత్రులు ఒక మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళం చేస్తున్నారన్నారు. అధికారులు అనవసరంగా చట్టానికి వ్యతిరేకంగా పని చేయవద్దని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వానికి సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రాజేశ్వర్‌ గౌడ్‌, మున్సిపల్‌ మాజీచైర్మన్‌ నర్సింహు లు, ముడా మాజీచైర్మన్‌ గంజి వెంకన్న, రవీందర్‌రెడ్డి, శివరాజ్‌, చెన్నయ్య, పటేల్‌ ప్రవీణ్‌కుమార్‌, నవకాంత్‌, శ్రీనివాస్‌రెడ్డి, అహ్మదుద్దీన్‌, పాలసతీష్‌, జంబులయ్య, ఇమ్రాన్‌, లక్ష్మయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement