సాగునీరు అందించాలి..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్లు లేక సరిగా నీటిని వినియోగించుకోలేకపోతున్నాం. కాల్వల ద్వారా నీరు కొన్ని ఎకరాలకే అందుతుంది. సీజన్‌లో తరచుగా కాల్వలకు గండ్లు పడి తెగుతున్నాయి. బొల్లంపల్లి, పోతెపల్లిలోని తిరుపతి చెరువు, సిల్లోనిబండ తండా చెరువులను రిజర్వా యర్లుగా మారుస్తామని చెప్పి ఇప్పటికీ అడు గు ముందుకు పడలేదు. త్వరగా రిజర్వాయర్లను ఏర్పాటుచేసి పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలి. – జంగయ్య, రైతు,
చొక్కనపల్లి, వెల్దండ మండలం
రిజర్వాయర్ నిర్మిస్తే మేలు
మాకు వడ్డేపల్లి మండలం 26 డిస్ట్రిబ్యూటరీ కింద భూమి ఉంది. అందులో ప్రస్తుతం 5 ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేశాను. కాగా ఆర్‌డీఎస్ కెనాల్ ద్వారా వచ్చే నీటిపై ఆధారపడే పంటలు సాగు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కెనాల్‌లో నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి.ప్రతి ఏటా రెండో పంట వేయాలంటే భయంగానే ఉంటుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మించినప్పటికీ, రిజర్వాయర్ లేకపోవడంతో దాని వల్ల కలిగే ప్రయోజనం నామమాత్రంగానే ఉంటుంది. రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందాలంటే రిజర్వాయర్ నిర్మించాలి.
– రంగారావు, రైతు, శాంతినగర్
ప్రతిపాదన దశలోనే..
కల్వకుర్తి కింద కొత్తగా రిజర్వాయర్ల ఏర్పాటు ప్రతిపాదన దశలో ఉంది. అవసరమైన చోట రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఎక్కువ నీటిని నిల్వచేసేలా ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు కొనసాగిస్తాం.
– విజయభాస్కర్‌రెడ్డి,సీఈ, నీటిపారుదల శాఖ
●
Comments
Please login to add a commentAdd a comment