వార్డు ఆఫీసర్లదే బాధ్యత
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అన్ని వార్డులలో ఇంటింటికీ తిరిగి ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి శివేంద్రప్రతాప్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. నగరంలో ఎక్కడైనా అక్రమ కట్టడాలు, వివిధ సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకుని రావాలన్నారు. మున్సిపల్ దుకాణాల అద్దె రూ.కోట్లలో పేరుకుపోయాయని, యజమానులకు నోటీసులు అందజేసి వసూలు చేయాలని ఆర్‌ఐలకు సూచించారు. స్పందించని వారి దుకాణాలను సీజ్ చేయాలన్నారు. ఇక ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వచ్చే మార్చిలోగా ఆయా ప్లాట్లు, లే–అవుట్లు క్రమబద్ధీకరించుకోవాలన్నారు.సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా, ఏసీపీ జోత్సా ్నదేవి, ఆర్‌ఐలు రమేష్, నర్సింహ, ముజీబుద్దీన్, అహ్మద్‌షరీష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారి శివేంద్రప్రతాప్
Comments
Please login to add a commentAdd a comment