నిష్టతో ప్రార్థనలు చేయాలి
రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో షబేఖద్ర్ జాగరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఐదు రాతుల్లో నిష్టతో ప్రార్థనలు చేయాలి, ఎతికేకాఫ్ పాటించాలి. దేవుని సన్నిధిలో ఉండి ప్రత్యేక నమాజులు చేసి దువా చేయాలి.
–మౌలానా మొహ్‌సిన్‌పాష ఖాద్రీ,
మహబూబ్‌నగర్
స్టేషన్ మహబూబ్‌నగర్: పవిత్ర రంజాన్ మాసం లైలతుల్ ఖద్ర్ ప్రత్యేక ప్రార్థనలు శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. రంజాన్ నెల చివరి దశకం కూడా మొదలు కావడంతో ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ రాత్రులను జరుపుకుంటారు. షబే ఖద్ర్ జాగరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చాంద్రమానం ప్రకారం ఇస్లామియా సంవత్సరం తిథులను రాత్రి పూట నుంచి లెక్కించడం పరిపాటి. అందువల్ల నేటి నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసపు 21, 23, 25, 27, 29 తేదీల్లోని రాత్రులను షబేఖద్ర్‌గా పాటిస్తూ ముస్లింలు ఈ రాత్రుల్లో తెల్లవారేదాకా జాగరణ చేసి అల్లాను ఆరాధిస్తారు.‘ షబే ఖద్ర్ అంటే అతి విలువైనది, గౌరవమైనదని’ అర్థం. వె సాధారణ రాత్రుల కంటే ప్రధానమైందని ఖురాన్‌లో ప్రవచించినందున ముస్లింలు ఈ రాత్రుల్లో జాగరణ చేసి క్షమాబిక్షను కోరుతూ ఇంటిల్లిపాదీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ పది రోజుల్లో ‘ఏతెకాఫ్’ అనే సంకల్పాన్ని పాటిస్తారు. ప్రతి మసీదులో ఆ ప్రాంతానికి చెందిన ముస్లిం ప్రముఖులు ఒక్కరైనా ఎతెకాఫ్‌ను విధిగా చేపట్టాలన్న నిబంధన ఉంది. పగలు, రాత్రి స్థానిక మసీదుల్లోనే ఉండి ఇతర ప్రాపంచిక ఆలోచనలు రాకుండా ఖురాన్‌ను పటిస్తూ, తరావీ, తహజ్జుద్ నమాజులు చేస్తూ లోక కల్యాణం కోసం దైవారాధన చేస్తారు. ఖబేఖద్ర్ వేడుకలకు మసీద్‌లు ముస్తాబయ్యాయి.
హాఫిజ్‌సాబ్‌లకు ఘన సన్మానం
పవిత్ర రంజాన్ మాసంలోనే ఖురాన్ గ్రంథం అవతరించింది. మసీదుల్లో హాఫిజ్ సాబ్‌లను నియమించుకొని వారితో నెల రోజులపాటు ప్రతి రోజు 20 రకాతుల ప్రత్యేక తరావీ నమాజ్‌లను చేయిస్తారు. పూర్తి ఖురాన్ గ్రంథం వినిపించిన హాఫిజ్‌లను ఘనంగా సన్మానిస్తారు. వీరికి హదియా (గౌరవవేతనం) అందిస్తారు. అదే విధంగా కొన్నిచోట్ల మూడు రోజులు, ఆరు రోజుల్లో కూడా పూర్తి ఖురాన్‌ను పఠించారు.
చివరి దశకంలోకి చేరిన రంజాన్
లోక కల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు
నేటినుంచి లైలతుల్ ఖద్ర్ జాగరణలు