కల్వకుర్తి టౌన్: పట్టణంలోని తిలక్‌నగర్ కాలనీలో ఇంట్లో దొంగలు పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మాధవరెడ్డి, బాధితులు తెలిపిన వివరాలు.. తిలక్‌నగర్ కాలనీలో నివాసముండే శ్రీను తన బంధువుల ఇంటికి కుటుంబంతో కలిసి గురువారం ఉదయం వెళ్లాడు. శుక్రవారం ఉదయాన్నే ఇంటికి తిరిగివచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలికి చేరుకున్న ఎస్‌ఐ, క్లూస్ టీం సిబ్బందితో క్లూస్ సేకరించారు. ఇంట్లో మూడు తులాల బంగారం, 40 తులాల వెండి, సుమారు రూ.లక్ష నగదు చోరీ జరిగినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మన్ననూర్: మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ రజిత కథనం ప్రకారం.. కొల్లాపూర్‌కు చెందిన ఎత్తం మల్లయ్య మన్ననూర్‌లో ఓ వ్యక్తి వద్ద కొంతకాలంగా నెల వేతనానికి పనులు చేస్తున్నాడు. చేసిన కష్టానికి తగిన జీతం ఇవ్వడం లేదని మద్యం తాగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చెప్పాడు. ఎస్‌ఐ ఉద యం రావాలని సూచించగా.. క్షణికావేశానికి లో నై పోలీస్‌స్టేషన్ బయట రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు, పోలీసులు అతడిని కాపాడారు.