
కార్మికులు హక్కుల కోసం పోరాడాలి
నారాయణపేట: కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మెట్రో గార్డెన్‌లో జరిగిన తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్(టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి అధ్యక్షతన రాష్ట్ర రెండో మహసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడకుండా ఏ హక్కులు సాధించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా సమ్మె అప్పుడు కార్మికులను ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. నాయకులు హనుమేష్, అరుణ్‌కుమార్, కిరణ్, నర్సిములు, కాశీనాథ్, ఎదిరింటి నర్సిములు, బోయిన్‌పల్లి రాము, వెంకట్ రాములు, సాంబశివుడు. ఎదుట్ల కుర్మయ్య, బోయిన్‌పల్లి గణేష్. చంద్రం, కృష్ణ, వెంకట్ ప్రసంగించారు. అనంతరం మెట్రో గార్డెన్ నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమై అంబేడ్కర్ చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా నర్సిరెడ్డి చౌక్‌కు చేరుకున్నారు.
టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం