
కల్యాణం చూతము రారండి
చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సిర్సనగండ్ల నుంచి భక్తులు, గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా గుట్టపైనున్న ఆలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సీతారాముల మాస కల్యాణం ప్రారంభం కాగా.. ఈ వేడుక 3 గంటల పాటు అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ కొనసాగింది. వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకించారు. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి దంపతులు, మాజీ ఎంపీ రాములు, తహసీల్దార్ సునీత దంపతులు, బీజేపీ నాయకులు భరత్‌ప్రసాద్, మండల నాయకులు వెంకట్‌గౌడ్, బాల్‌రాంగౌడ్, కల్లు సురేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సందీప్‌రెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కల్యాణం అనంతరం భక్తులకు సిర్సనగండ్లకు చెందిన పిన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు లక్ష్మణ్‌శర్మ, వేణుశర్మ, మురళీధర్‌శర్మ, కోదండరామశర్మ, రఘుశర్మ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ వేడుకకు సర్వం సిద్ధం..
శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం తరుఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి వేడుకలో పాల్గొననున్నారు. వేడుకకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, అవసరమైన చోట టెంట్లు, నీటివసతి, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. అలాగే కల్యాణ మండపం ఎదురుగా సుమారు 10 వేల మంది భక్తులు కూర్చొనేల, కల్యాణ మండపం చుట్టూ 20 వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌కు గుట్టపై స్థలాలు చదును చేశారు. వృద్ధులు, మెట్లపై నుంచి రాలేని వారి కోసం ఆలయం ఆధ్వర్యంలో గుట్టపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చైర్మన్ ఢేరం రామశర్మ చెప్పారు.
సిర్సనగండ్లలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
నేడు సీతారాముల కల్యాణ వేడుక
మొదటిరోజు ముగిసిన మాస కల్యాణం
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

కల్యాణం చూతము రారండి