
ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం
మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఎన్‌డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కల్పించబడిన చట్టబద్ధ హక్కులను హరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక కర్షక ఫాసిస్ట్ విధానాలపై మే రెండో వారంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్న చూపు చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
నూతన కమిటీ ఎన్నిక
మహబూబ్నగర్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భాగి కృష్ణయ్యయాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కోట కదిర నరసింహ, జిల్లా ప్రధానకార్యదర్శిగా పి.సురేష్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఆంజనేయులు, కోశాధికారిగా ఎం.మధుసూదన్ రెడ్డి. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులుగా అమరజ్యోతి, బి.చెన్నయ్య, రంగన్న, పద్మ, జిల్లా సహాయ కార్యదర్శులుగా జి.మొగులన్న, దేవానంద్, జే.నరసింహ, యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులుగా నరసింహ, గోపాల్నాయక్, సాయి ప్రకాష్, శ్రీనివాసులు, రాములు, నరసింహ, ఆంజనేయులు, హరితో పాటు మరో ఏడుగురు సభ్యులను ఎన్నుకున్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్
ముగిసిన 12వ జిల్లా మహాసభలు