
బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపైన బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. పార్టీ ఏర్పడి 25ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్‌లోజరిగే రజతోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌రాజేశ్వర్‌గౌడ్, నాయకులు నర్సిములు, వెంకటన్న, ఆంజనేయులు, గణేష్, దేవేందర్‌రెడ్డి, శివరాజు, సాయిలు, శ్రీనివాస్‌రెడ్డి, నవకాంత్, శ్రీకాంత్‌రెడ్డి, శరత్, వర్థభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.