
తల్లి పాల బ్యాంక్
దామరగిద్దలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటున్న యువకులు
నేడు జనరల్ ఆస్పత్రిలో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం
● ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందేనవజాత శిశువులకు ఉపయోగకరం
● అత్యాధునిక పద్ధతిలో ఉత్పత్తి
● దాతల ద్వారా తల్లిపాల సేకరణ
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో గురువారం సుషేనా హెల్త్ ఫౌండేషన్–జనరల్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్– కంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్ ప్రారంభం చేయనున్నారు. తల్లి పాలు నిల్వ చేయడంతో పాటు లాక్టేషన్ సపోర్ట్ సర్వీస్, బరువు తక్కువగా చిన్నారులకు, నెలలు నిండకముందే ప్రసవం అయిన చిన్నారులకు, తల్లిపాలు లేని చిన్నారుల కోసం తల్లి పాలను సేకరించి.. అవసరమైనన వారికి అందించడమే ఈ బ్యాంకు ముఖ్య ఉద్దేశం. ప్రసవం తర్వాత పాలు ఉత్పత్తి కాని తల్లులకు సైతం బ్రెస్ట్ పంప్ వంటి ప్రత్యేక పద్ధతి ద్వారా వారి నుంచి పాలు ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు చేపడతారు. అలాంటి తల్లులు మొదట వారి పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను బ్యాంకులో వితరణ చేయాల్సి ఉంటుంది. అలాగే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాలు వితరణ చేసిన తల్లుల పాలను సేకరించి అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి చిన్నారులకు అందిస్తారు.
● ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న జనరల్ ఆస్పత్రిలో ప్రతి రోజు 30 నుంచి 35 ప్రసవాలు అవుతాయి. ఇందులో ముగ్గురి నుంచి నలుగురు శిశువులకు ఆరోగ్య సమస్యలతో పాటు తల్లిపాలు సక్రమంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈక్రమంలో ఇలాంటి నవజాత శిశువులను ఎస్‌ఎన్‌సీయూలో అడ్మిట్ చేసి చిన్న పిల్లల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తుంటారు. ప్రతి నెల జనరల్ ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూలో 350 చిన్నారులు చేరుతుంటే.. ఇందులో బయటి ఆస్పత్రుల నుంచి రెఫర్ మీద దాదాపు వంద కేసులు వస్తుంటాయి. వీరందరికీ తల్లి పాలు ఉండవు. ఈ క్రమంలో ఇలాంటి శిశువులు అందరికీ తల్లి పాల బ్యాంకు వల్ల మేలు జరగనుంది.
● పాల బ్యాంకు ద్వారా పెస్టరైజ్ చేసిన డోనర్ బ్రెస్ట్ మిల్క్‌ను అందించడం జరుగుతుంది. సేకరించిన పాలలో 10ఎంఎల్ కల్చర్ పరీక్షలు పూర్తి చేసిన త ర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పెస్టరైజ్ డోనర్ వ్యూమన్ మిల్క్‌ను జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువులకు వైద్యుల సలహా, సూచన మేరకు ఉచితంగా అందిస్తారు. సాధారణంగా పౌడర్, డబ్బా పాలు, గేదె, ఆవు పాలు తాగించడం వల్ల నవజాత శిశువు ల జీర్ణక్రియ అరిగించే సామర్థ్యం చాలా తక్కువగా ఉండటం వల్ల కొత్త రకం ఆరోగ్య సమస్యలు వస్తా యి. ఈ పద్ధతి ద్వారా సేకరించిన తల్లి పాలు దాదా పు ఏడాది పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంది.
● జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకులో అత్యంత ఖరీదైన పరికరాలు ఏర్పాటు చేశారు. పెస్టరైజ్ ఫ్రీజర్లు, –20 డిగ్రీ ఫ్రిజ్‌లు, బ్రెస్ట్ పంప్‌లు మూడు, ప్రత్యేక ఆర్‌ఓ ప్లాంట్, ప్రత్యేక మిషనరీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నిలోఫర్ ఆస్పత్రి తర్వాత అత్యంత పెద్ద తల్లిపాల బ్యాంకుగా పాలమూరు జనరల్ ఆస్పత్రి నిలిచిపోనుంది. ప్రీటర్మ్, బరువు తక్కువగా ఉన్న పిల్లలు సాధారణ పాలు మింగలేరు. దీంతో డోనర్ పాల ద్వారా వారికి ముఖ్యమైన పోషకాలు, యాంటీబాడీస్, వృద్ధికారకాలను అందించడానికి ఉపయోగపడుతుంది.

తల్లి పాల బ్యాంక్

తల్లి పాల బ్యాంక్