
నేటినుంచి ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో శనివా రం, ఆదివారాల్లో ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహించనున్నారు. స్థానిక మెయిన్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. విశాఖపట్నం, నెల్లూరు, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థులు, మహబూబ్‌నగర్ జట్లు టోర్నీకి హాజరవుతున్నాయి. 40 ఏళ్లకు పైబడి క్రీడాకారులు ఫుట్‌బాల్ మ్యాచులు ఆడనున్నారు. రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన జట్లు విన్నర్, రన్నరప్‌గా నిలుస్తాయి. మొదటిసారిగా జిల్లా కేంద్రంలో ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడంగా విజయవంతం కోసం ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెయిన్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఇన్విటేషన్ టోర్నీ ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఫుట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇమ్మాన్యుయెల్ జేమ్స్, రామకృష్ణ, శశిధర్, రాజశేఖర్, నాగేశ్, కె.రాజేందర్ పరిశీలించారు. ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టోర్నీ విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. టోర్నీ ప్రారంభోత్సవంలో జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు, సీనియర్ క్రీడాకారులు ఎన్‌పీ వెంకటేశ్, ఉపాధ్యక్షులు టీఎస్.రంగారావు, శంకర్‌లింగం, రాయల రమేష్, ప్రేమ్‌రాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు జట్ల హాజరు
రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు