అట్టహాసంగా ఎస్టీపీపీ క్రికెట్ లీగ్
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో 11వ సీజన్ క్రికెట్ లీగ్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్లాంటులోని ఆయా డిపార్టుమెంట్లు, ఆయా కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి 10 జట్లు క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా క్రికెట్ పోటీలను ఎస్టీపీపీ ఇన్చార్జి ఈడీ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని లీగ్ చీఫ్ కోఆర్డినేటర్ పంతులా, వోఅండ్‌ఎం చీఫ్ జెన్సింగ్తో కలిసి ప్రారంభించారు. ఆటలు ప్రతి ఒక్కరికీ మానసిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేస్తాయన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు. అనంతరం మొదటి మ్యాచ్ ఎస్టీపీపీ మావారేక్స్కి బీపీఏ ఎగ్జిక్యూటీవ్స్కి మధ్య జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసి న బీపీఏ ఎగ్జిక్యూటీవ్స్ టీం 12 ఓవర్లలో 44 పరుగులు చేసి ఆలౌట్ కాగా మావారేక్స్ టీం 5.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసి గెలిచింది. మా వారేక్స్ టీంలో విషువర్ధన్‌రెడ్డి రెండు వికెట్లు తీసి 17 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఎస్టీపీపీ అధి కారులు ఏకే.సింగ్, సముద్రాల శ్రీనివాస్, సత్యనా రాయణ, అఖిల్‌కపూర్, శ్రీనివాస్, శివప్రసాద్, బ్రహ్మం, మోహన్‌సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment