మాదక ద్రవ్యాలను నియంత్రించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యార్థుల భవిష్యత్‌పై మా దక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత అంశాలపై డీసీపీ భాస్కర్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నందగోపాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా బుధవారం పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పా టు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నా రు. 2024లో 63 మాదక ద్రవ్యాల కేసులు నమోదు కాగా 167 మంది, 2023లో 53 కేసుల్లో 82 మంది అరెస్టు అయ్యారన్నారు. 35 మందిని డ్రగ్ డి–అడిక్ష న్ కేంద్రాలకు పంపించామన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు నిల్వ ఉన్నట్లు తెలిస్తే వెంటనే 100కు సమాచారం అందించాలన్నారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 29 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో డీసీపీ ఏ.భాస్కర్, అదనపు కలెక్టర్ మోతీలాల్‌లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్వహించనున్న పరీక్షలకు 39 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్ల నియామకం, నిరంతర విద్యుత్ సరఫరా, ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment