‘ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రజాస్వామికం’
పాతమంచిర్యాల: ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రజాస్వామికమైందని బీసీ కళాకారులు, మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ దరువు అంజన్న, కవి మోహన్ బైరాగి, క్రాంతి కళా బృందం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటాచారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రజక సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7న ఎమ్మార్పీఎస్ నిర్వహించే లక్ష డప్పులు, వేయి గొంతుకల కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగల బతుకుల్లో వెలుగులు విరజిమ్ముతాయని, సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్మాదిగ, అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, ఎంఎస్పీ మంచిర్యాల ఇంచార్జి శరత్, మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా ఇంచార్జి రేణికుంట్ల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిళ్ల మల్లేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment