అంగన్వాడీ స్థలం కబ్జాను అడ్డుకున్న అధికారులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో మళ్లీ భూ కబ్జాల పర్వం మొదలైంది. రెండో వార్డు ఇందిరమ్మకాలనీలో అంగన్వాడీ కేంద్రం కో సం గుర్తించిన ప్రభుత్వ స్థలం కబ్జాకు కొందరు బుధవారం యత్నించారు. బుధాకలాన్ శివారు సర్వేనంబర్ 170లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంపై కన్నేసిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆక్రమణ కు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాసరావు, తహసీల్దార్ జ్యోత్స్న సిబ్బందితో వెళ్లి ఆక్రమణదారు ప్రభుత్వ ఖాళీ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చి వేశారు. ప్రహరీ కూల్చకుండా నాయకులు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రెవె న్యూ, మున్సిపల్ అధికారులు ప్రహరీ కూల్చి వేయించారు. దీంతో సదరు నాయకులు అధి కారులతో వాగ్వాదానికి దిగారు. అదేమీ లెక్క చేయకుండా ఆక్రమిత భూభాగంలో ‘ఇది ప్ర భుత్వ భూమి ఆక్రమణదారులు శిక్షార్హులు’ అని తహసీల్దార్ పేరుతో హెచ్చరిక బోర్డును అధికారులు ఏర్పాటు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment