రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

Published Thu, Jan 30 2025 12:21 AM | Last Updated on Thu, Jan 30 2025 12:21 AM

రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రాష్ట్రంలో ఎంపిక చేసి న అటవీ డివిజన్లలో అనుమతితో రోడ్లు, బ్యా లెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రాజెక్టు స్క్రీనింగ్‌ కమి టీ నోడల్‌ అధికారి డాక్టర్‌ సి.సువర్ణ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ ఆరణ్య భవనంలోని పీసీసీఎఫ్‌ కార్యాలయం నుంచి ఇరిగేషన్‌, క్యాట్‌ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జూమ్‌ మీటింగ్‌ ద్వారా ప్రాజెక్టు స్క్రీనింగ్‌ కమిటీలోని జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మంచిర్యాల డి విజన్‌ పరిధిలో రాచెర్ల నుంచి అర్జునగుట్ట మీ దుగా వెచల్లి, రొయ్యలపల్లి, సిర్సా, అన్నారం వరకు ఏడు మీటర్ల వెడల్పుతో 7,428 హెక్టార్లలో బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులతో ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, జిల్లా అటవీ అధికారి శివ్‌ ఆశిష్‌ సింగ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, రోడ్డు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement