ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలి
నెన్నెల: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమెక్రసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జలసాధన సమితి రాష్ట్ర కన్వీనర్ నైనాల గోవర్థన్ డి మాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో వా రు విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2008లో శంకుస్థాపన చేసిందని, ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి వరకు కాలువ నిర్మాణానికి రూ.1700 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నీరు లేదనే కుంటిసాకుతో కాళేశ్వరం మేడిగడ్డకు మార్చి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని, బడ్జెట్ను లక్షా 50వేల కోట్లకు పెంచి ‘కల్వకుంట్ల’ కుటుంబం, మెగా ఇంజినీరింగ్ కంపెనీ వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. మేడిగడ్డ నుంచి నీరు శాశ్వతంగా వచ్చే అవకాశం లేదని, ప్రాణహిత ప్రాజెక్టు తప్పా మరే గత్యంతరం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్కుమార్, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి మంగ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment