వందశాతం అక్షరాస్యత సాధించాలి
కాసిపేట: మండలం వంద రోజుల్లో వంద శా తం అక్షరాస్యత సాధించాలని, జిల్లా అధికా రుల సమన్వయంతో గ్రామస్థాయిలో అధికా రులు ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ సూచించారు. బుధవారం మండలంలోని ముత్యంపల్లి రైతువేదికలో కాసిపేట మండలాన్ని వయోజనవిద్యలో భాగంగా వంద రోజుల్లో వందశాతం అక్షరాస్యతకు జిల్లా కలెక్టర్ ఎంపిక చేసినందున జిల్లా అధికారులతో కలిసి గ్రామస్థాయి సిబ్బందితో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరిస్తూ కార్యక్రమ ఉద్దేశం, ప్రణాళిక అమలు విధానాన్ని తే లియచేశారు. అనంతరం అక్షర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వయోజనవిద్య జిల్లా ప్రా జెక్టు అధికారి పురుషోత్తంనాయక్, డీఆర్డీవో కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, బెల్లంపల్లి, మంచిర్యాల ఆర్డీవోలు హ రికృష్ణ, శ్రీనివాసరావు, సీడీపీవో స్వరూపరా ణి, జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఅర్డినేటర్ సత్యనారాయణమూర్తి, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో సత్యనారాయణసింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment