ఇక నగర పాలన | - | Sakshi
Sakshi News home page

ఇక నగర పాలన

Published Wed, Jan 29 2025 12:53 AM | Last Updated on Wed, Jan 29 2025 12:53 AM

-

మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మంచిర్యాల

జీవో విడుదల చేసిన సీడీఎంఏ కమిషనర్‌ డాక్టర్‌ టీకే.శ్రీదేవి

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ సీడీఎంఏ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డాక్టర్‌ టీకే.శ్రీదేవి మంగళవారం జీవో విడుదల చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూరు మున్సిపాలిటీతోపాటు హాజీపూర్‌ మండలంలోని పోచంపాడ్‌, గుడిపేట్‌, నర్సింగాపూర్‌, నంనూరు, చందనాపూర్‌, ముల్కల్ల, కొత్తపల్లి, వేంపల్లి జీపీలను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి సంబంధించిన రికార్డులన్నీ వెంటనే మంచిర్యాల మున్సిపాలిటీకి అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. జీపీల్లోని రశీదులు, రికార్డులు, మినట్స్‌ బుక్‌లను సీజ్‌ చేయడంతోపాటు, ఇప్పటికే ఉన్న బ్యాంక్‌ అకౌంట్ల స్థానంలో కొత్త బ్యాంక్‌ అకౌంట్‌ ‘ది మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌’ పేరిట ఏదైనా నేషనలైజ్డ్‌ బ్యాంకులో తీసుకోవాలని, మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. పూర్తి రికార్డులతోపాటు, అందుకు సంబంధించిన రిపోర్టును ఫిబ్రవరి 6లోగా మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 26తో ముగియగా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement