అంతరిక్ష, రక్షణ రంగంలో దేశాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అంతరిక్ష, రక్షణ రంగంలో దేశాభివృద్ధి

Published Wed, Jan 29 2025 12:52 AM | Last Updated on Wed, Jan 29 2025 12:52 AM

అంతరిక్ష, రక్షణ రంగంలో దేశాభివృద్ధి

అంతరిక్ష, రక్షణ రంగంలో దేశాభివృద్ధి

● ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాలఅర్బన్‌: అంతరిక్ష, రక్షణ రంగంలో భా రతదేశం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఉషోదయ పాఠశాలలో ఇస్రో, డీఆర్‌డీవో సహకారంతో సాంకేతిక ప్రదర్శన స్పేస్‌ డిఫెన్స్‌ ఎక్స్‌పో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రక్షణకు అవసరమయ్యే మిస్సైల్స్‌ శాటిలైట్లను, రాకెట్లను స్వదేశీ పరిజ్ఞానంతో పనిచేయించడం దేశానికి గర్వకారణమన్నారు. శక్తి మిస్సైల్‌ను తయారు చేయడంలో అత్యంత కీలకమైన సతీశ్‌రెడ్డి మంచిర్యాలకు వచ్చి విద్యార్థులకు దేశ రక్షణపై అవగాహన కల్పించడం హర్షనీయమన్నారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌, భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ కనీస వసతులులేని మారుమూల ప్రాంతం నుంచి డీఆర్‌డీవో చైర్మన్‌గా ఎదగడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఉందన్నారు. తన జీవితంలో అబ్దుల్‌ కలాంతో కలిసి పనిచేయడం ఒక అద్భుత ఘట్టమన్నారు. రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా భారత రక్షణ రంగానికి అడ్వైజర్‌గా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నానన్నారు. అనంతరం వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అలరించిన ఇన్‌స్పైర్‌ ఇండియా, సాంకేతిక ప్రదర్శన

కేఐవైఈ ఫౌండేషన్‌, ఇస్రో డీఆర్‌డీవో సహకారంతో ఏర్పాటు చేసిన ఇన్‌స్పైర్‌ ఇండియా, సాంకేతిక రక్షణ రంగం ప్రదర్శనలను ముఖ్యఅతిఽథులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ప్రారంభించగా విద్యార్థులు తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం అబ్దుల్‌ కలాం జీవిత చరిత్ర పుస్తకాలను విద్యార్థుల కు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో యాద య్య, ఇస్రో సైంటిస్టు శివశంకర్‌, డీఎస్‌వో మధుబా బు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శేఖర్‌రావు, కార్యక్రమ నిర్వాహకుడు బాలాజీ, ట్రస్మా బాధ్యులు విష్ణువర్ధన్‌రావు, రమణ, చంద్రమోహన్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement