● లెక్కతేల్చిన అధికారులు ● ప్రాజెక్టుల వారీగా వివరాలు ప
మంచిర్యాలటౌన్: చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించడంతోపాటు పూర్వ విద్యనందిస్తూ, బడికి వెళ్లేందుకు సంసిద్ధం చేసేలా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ శాఖ తన పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీచర్లు, ఆయాలు, ఖాళీల వివరాలతోపాటు ఏ నెలలో ఎంతమంది ఉద్యోగ విరమణ పొందనున్నారనే వివరాలనూ అన్ని జిల్లాల నుంచి ఇటీవల సేకరించారు. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. అంగన్‌వాడీ టీచర్ల ఖాళీలు 62, ఆయాల ఖాళీలు 253 ఉన్నట్లు గుర్తించి నివేదిక అందజేశారు. టీచర్లు, ఆయాలు లేక పలు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ పక్కనే ఉన్న మరో అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్న వారికి అప్పగించారు. దీంతో అదనపు భారంగా మారుతూ ఏ కేంద్రంలోని చిన్నారులకు ప్రభుత్వం ఆశించిన లక్ష్యం మేరకు లబ్ధి చేకూరడం లేదు. ఎన్నో ఏళ్లుగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేక ఆ ప్రాంతానికి చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగ విరమణ..
అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ ప్రక్రియ గత ఏడాదిగా కొనసాగుతోంది. గత ఏడాది జూలై ఒకటి నాటికి 65ఏళ్లు పైబడిన వారికి రిటైర్మెంట్‌ను ప్రకటించగా.. ఇప్పటివరకు 13మంది టీచర్లు, 122మంది ఆయాలు ఉద్యోగ విరమణ పొందారు. గత ఖాళీలతోపాటు రిటైర్మెంట్‌తో ఏర్పడుతున్న ఖాళీల సంఖ్య ప్రతీ నెల పెరుగుతూ వస్తోంది. ఖాళీలను భర్తీ చేస్తారని ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇటీవల ప్రభుత్వం ఖాళీల వివరాలు జిల్లా అధికారుల నుంచి సేకరించడంతో వచ్చే నెలలో ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుందని తెలుస్తోంది. ఖాళీలను భర్తీ చేస్తే ఆ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు ఆయా కేంద్రాల నుంచి అందాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందేందుకు అవకాశం ఉంటుంది. ఖాళీల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై ఆ భారం పడుతోంది. గత ఏడాది నుంచి టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ ప్రక్రియ కొనసాగుతుండగా, వారి స్థానంతోపాటు గతంలో ఖాళీలుగా ఉన్న స్థానాల్లో నియామకాలను చేపడతారని చెబుతున్నా ఏడాదిగా కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటికే ఖాళీల వివరాలను రాష్ట్ర శాఖ తెప్పించుకోవడంతో భర్తీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు పంపించాం
జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీచర్లు, ఆయాలకు సంబంధించి ఖాళీల వివరాలను ఇప్పటికే రాష్ట్ర శాఖకు పంపించాం. ఖాళీల భర్తీ కోసం చర్యలు తీసుకోవడంలో భాగంగానే వివరాలు తీసుకోవడం జరిగింది. వచ్చే నెలలో భర్తీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.
– రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు(ఫైల్)
అంగన్‌వాడీ
జిల్లాలో ఖాళీల వివరాలు ప్రాజెక్టుల వారీగా
ప్రాజెక్టు అంగన్‌వాడీ ఖాళీలు ఆయాలు ఖాళీలు కేంద్రాలు
టీచర్లు
బెల్లంపల్లి 279 267 12 225 54
చెన్నూరు 245 227 18 169 76
లక్సెట్టిపేట 203 189 14 151 52
మంచిర్యాల 242 224 18 171 71
మొత్తం 969 907 62 716 253
Comments
Please login to add a commentAdd a comment