ఉత్పత్తుల ఎగుమతి శాతాన్ని పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్పత్తుల ఎగుమతి శాతాన్ని పెంచాలి

Published Tue, Jan 28 2025 12:10 AM | Last Updated on Tue, Jan 28 2025 12:10 AM

-

పాతమంచిర్యాల: జిల్లా నుంచి ఉత్పత్తుల ఎగుమతి శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా గ్రామీణా భివృద్ధి, పంచాయతీ, ఉద్యానవన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, బ్యాంకింగ్‌, వ్యవసాయ శాఖల అధికారులతో జిల్లాలో ఉత్పత్తులు–ఎగుమతు లు అనే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, పరి శ్రమ రంగాలను ప్రోత్సహిస్తూ ఉత్పత్తుల ఎగుమతి శాతాన్ని పెంపొందించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేస్తూ అధిక మొత్తంలో ఉత్పాదకతను పెంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా కృషి చేయాలని తెలిపా రు. మామిడి, వరిధాన్యం ఎగుమతిపై దృష్టి సారించాలని, ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తుల ఎగుమతి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో కులవృత్తుల వా రికి ఆర్థిక చేయూత అందించడానికి కృషి చేస్తామని అన్నారు. విశ్వకర్మ పథకంపై ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

క్యాలెండర్‌ ఆవిష్కరణ

మంచిర్యాలక్రైం: దివ్యాగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సంఘం 2025 క్యాలెండర్‌ను కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డెవిల్‌ ఫేయిర్‌ శాఖాధికారి, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు, ఆ సంఘం అధ్యక్షుడు సీహెచ్‌.బాపు, ఉపాధ్యక్షుడు జీ.తిరుపతి, జనరల్‌ సెక్రెటరీ కే.తిరుపతి, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ మురళి, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ తిరుపతి, కోశాధికారి సురేందర్‌, దివ్యాంగ ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement