కంటి పరీక్షలు చేయించుకోవాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నలభై ఏళ్లు దాటి వారంతా కంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీ కన్వెన్షన్ హాల్లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రక్తదానం, కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. 53మంది రక్తదానం చేయగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్‌రెడ్డి, ఎంవీఐ రంజిత్, ఏఎంవీఐ ఖాసీం, సూర్యతేజ, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
త్యాగధనుల సేవలు చిరస్మరణీయం
మంచిర్యాలఅగ్రికల్చర్: దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగధనుల సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వా తంత్య్ర సమరయోధుల సేవలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్ పాల్గొన్నారు.
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
మంచిర్యాలఅర్బన్: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. గురువారం ఎస్సీ బాలికల కళాశాలల వసతిగృహంలో ‘పది’ విద్యార్థులకు ప్రేరణ–అవగాహన త రగతులు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంత రం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. స బ్జెక్టు టీచర్స్ పరీక్ష విధానం, ప్రశ్నలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఈవో యాదయ్య, జి ల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్, ఎస్సీ వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment