ప్రభుత్వాసుపత్రి తనిఖీ
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కోటేశ్వర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఆరోగ్యశ్రీ, పేషంట్ కేర్ వంటి సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ పీవీవీఎస్‌ఎన్ మూర్తి, ఆర్ఎంవో శీల, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
కార్యాలయాల పేర్లు మార్పు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడగా, అందులో విలీనమైన గ్రామాల బోర్డులను అధికారులు మారుస్తున్నారు. గురువారం ముల్కల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం బోర్డును నగరపాలక సంస్థ, మంచిర్యాలగా మార్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ కే.విజయ్‌కుమార్, ఏఈ టెక్నికల్ ఆఫీసర్ అప్రీన్ తబస్సుం, ముల్కల్ల సెక్రెటరీ శ్రీనివాస్, కారోబార్ సత్యనారాయణ, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment