విద్య, ఉపాధి కేంద్రంగా హాజీపూర్‌ | - | Sakshi
Sakshi News home page

విద్య, ఉపాధి కేంద్రంగా హాజీపూర్‌

Published Sat, Mar 29 2025 12:08 AM | Last Updated on Sat, Mar 29 2025 12:10 AM

పర్యాటక కేంద్రంగానూ గుర్తింపు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండలం విద్యాకేంద్రంగానే కాకుండా ఐటీ పార్కు, ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా మారుతోంది. పర్యాటకంగానూ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రాథమి క, మాధ్యమిక, ఉన్నత విద్యతోపాటు గురుకుల, కస్తూరిభా పాఠశాలలతోపాటు ఇప్పుడు కేంద్రియ విద్యాలయం, వైద్య కళాశాలకు హాజీపూర్‌ మండలం వేదికగా మారింది. కేంద్రియ విద్యాలయం నూ తన భవన నిర్మాణం పూర్తి కాగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వ వైద్య కళాశాల భవనం, హాస్టల్‌ భవన నిర్మాణాల పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలోగా గుడిపేటలోనే కేంద్రి య విద్యాలయం, వైద్య కళాశాల తరగతులు ప్రా రంభం కానున్నాయి. త్వరలోనే యువత భవిష్యత్‌ భరోసా కోసం హాజీపూర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటు జరుగుతోంది. ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌లో వివిధ ప్రాంతాల యువత కానిస్టేబుల్‌, ఎస్సైలుగా శిక్షణ పొందుతూ ఉద్యోగాల్లో చే రుతున్నారు. వేంపల్లి, ముల్కల్ల శివారులోని 300 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ హబ్‌, ఐటీ పార్కు ఏర్పాటు కు వేగంగా అడుగులు పడుతున్నాయి. పరిశ్రమల శాఖ నుంచి ఉన్నతాధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించగా.. జిల్లా కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, రెవె న్యూ అధికారులు నివేదిక అందజేశారు. వేంపల్లి శివారులోని 159 సర్వే నంబర్‌లో ఉన్న దాదాపు 180 ఎకరాల స్థలాన్ని ఇందుకు సిద్ధం చేశారు.

పర్యాటక కేంద్రంగా..

హాజీపూర్‌ మండలం పర్యాటక కేంద్రంగానూ గు ర్తింపు పొందుతోంది. మండలంలో ఎంసీసీ క్వారీ గుట్టలు దుర్గాదేవి జాతరతోపాటు పిక్నిక్‌, ఇతర కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. ర్యాలీ గిరిజన గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని జలపాతానికి ప్రత్యేకత ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు దిగువన 30 ఎకరాల్లో బొమ్మె చేపల పెంపకం చేపడుతున్నారు. ముల్కల్లలో ర్యాలీవాగు ప్రాజెక్ట్‌ కనువిందు చేస్తుండగా.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ప్రధాన ఆకర్షణగా నిలు స్తోంది. 62 గేట్లతో ఏకంగా 20టీఎంసీలకు పైగా నీటి సామర్థ్యంతో వర్షాకాలం భారీ వరదల సమయంలో గేట్లు తెరిచినప్పుడు దృశ్యాలు కనువిందు చేస్తాయి. ప్రాజెక్ట్‌లో బోటింగ్‌ సదుపాయం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

జంగల్‌ సఫారీ..

గఢ్‌పూర్‌ గ్రామ శివారులోని ఎంసీసీ క్వారీలోని అట వీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గాంధారీ ఖిల్లా స ఫారీ 25 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అడ వి అందాలు, వన్యప్రాణుల సందర్శన పర్యాటకులను మరింత కనువిందు చేస్తున్నాయి.

విద్య, ఉపాధి కేంద్రంగా హాజీపూర్‌1
1/1

విద్య, ఉపాధి కేంద్రంగా హాజీపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement