
హీరాసుకా జెండా తొలగింపుపై చర్చావేదిక
● తరలివచ్చిన ఉమ్మడి జిల్లా ఆదివాసీలు
ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన పర్ధాన్ సమాజ్ కుల గురువు హీరాసుకా స్మారక జెండాను ఇటీవల గుర్తు తెలియని దుండగులు తొలగించారు. దీనిపై శనివారం కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్‌లో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నాలుగు సగల ఆదివాసీలతో చర్చావేదిక నిర్వహించారు. నాగోబా ప్రాంగణంలో హీరాసుక జెండాను ఏర్పాటు చేయడం సరికాదని, వేరేస్థలంలో ఏర్పాటు చేయాలని తీర్మాణించారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి కేస్లాపూర్ నాగోబా దర్బర్ హాల్‌లో కొనసాగుతున్న ఆదివాసీల చర్చావేదికను ఉట్నూర్ సీఐ మొగిలి, ఎస్సై దుబ్బక సునీల్ ద్వారా తెలుసుకున్నారు.