
కేదారేశ్వర ఆశ్రమంలో పూజలు
బాసర: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం బాసరలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కన్యపూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకుడు అతుల్ మహరాజ్ బాలికల కాళ్లు కడిగి పూజలు చేశారు. పార్వతీదేవి తొమ్మిది అవతారాలకు చిహ్నంగా తొమ్మిది మంది బాలికలకు కన్యపూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం అన్నప్రసాదం అందజేశారు. పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
టీవీషోలో గురుకుల విద్యార్థుల ప్రతిభ
ఇచ్చోడ: ఓ తెలుగు టీ వీషోలో మండల కేంద్రంలోని గురుకుల విద్యార్థులు బంగారు పథకాలు సాధించారు. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్ధులు ధనుశ్, వినోద్‌లు జీతెలుగు టీవీషోలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పథకాలు గెల్చుకున్నారు. ఆదివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గోవర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, బోజన్నలు విద్యార్ధులను అభినందించారు.

కేదారేశ్వర ఆశ్రమంలో పూజలు