
ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం
ఇంద్రవెల్లి: ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపిన వివరాల మేరకు గోపాల్‌పూర్‌కు చెందిన లాండ్గే సాహెబ్‌రావ్‌కు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని దోందరి గ్రామానికి చెందిన ఎల్లవ్వతో రెండేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు కుమార్తె సంతానం. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరుసకు చిన్నమ్మ కుమారుడైన సట్ల దశరథ్ ఏడాది నుంచి సాహెబ్‌రావ్ ఇంట్లోనే ఉంటూ ఎల్లవ్వతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గమనించిన సాహెబ్‌రావ్ భార్యను మందలించాడు. దీంతో తమకు అడ్డు వస్తున్న భర్తను ఎలాగైనా చంపాలనుకుంది. ప్రియుడు దశరథ్‌తో కలిసి బుధవారం తెల్లవారు జామున సాహెబ్‌రావ్‌పై గొడ్డలి, రాళ్లతో దాడి చేసి పారిపోయారు. ఘటనలో సాహెబ్‌రావ్‌కు తలకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యయాత్రానికి గల కారణలను అడిగి తెలుసుకున్నారు. బాధితుని సోదరుడు లాండ్గే బాపురావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.